MLA | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MLA | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLA| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మండలంలోని లంకాం గ్రామంలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ (Gondu Shankar) ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే తెలిపారు.
రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు, అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే (MLA) అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా, కొనుగోలు కేంద్రాల్లోనే క్రయవిక్రయాలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
