కరోనా కాలంలో నర్సుల త్యాగం చిరస్మరణీయం

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్ర సామాజిక ఆరోగ్య కేంద్రంలో అంత ర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు ఉద్యమకారులు చింతకుంట్ల జగన్ మోహ న్ రెడ్డి , పార్సి రంగారావు, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నాయకులు శీలం శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులందరికీ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నర్సులు పోషిస్తున్న పాత్ర ఎంతో గొప్పదని నాయకులు కొనియాడారు. రోగుల బాధలను తమవి గా భావించి రాత్రింబవళ్లు సేవలందిస్తూ సమాజానికి అండగా నిలుస్తు న్న నర్సుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. వైద్య రంగంలో వైద్యు లతో పాటు నర్సులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవ లందించిన వారి త్యాగాన్ని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బంగ్లా శ్రీను, మునిగేల రాజు, పావని, కవిత, జబ్బార్, ప్రవీణ్, హీరాసింగ్, ఆసుపత్రి సూపరిండెట్ సంధ్య, హెడ్ నర్సు విజయరాణి, స్టాఫ్ నర్స్ నాగవేణి, రణతబాసిన్, సుజాత, ఆశాజ్యోతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
