శ్రీధర్‌రెడ్డికి మతిభ్రమించింది.. పిచ్చాసుపత్రిలో చేర్చాలి

శ్రీధర్‌రెడ్డికి మతిభ్రమించింది.. పిచ్చాసుపత్రిలో చేర్చాలి
- కేసుల్లో ఇరుకుంటే రక్షించింది కాంగ్రెస్ నేతలే
- వెంచర్ల వద్ద వసూళ్లకు పాల్పడింది నువ్వే..
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతల మండిపాటు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : శ్రీధర్‌రెడ్డికి మతిభ్రమించిందని అందుకే పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలని అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ చైరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌండ్ల ప్రశాంత్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల మల్లారెడ్డి, సదాశివపేట మండలాధ్యక్షుడు శ్రీనివాస్, గొల్లపల్లి పీఏసీఎస్ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మాచపల్లి సర్పంచ్ కిషన్‌నాయక్ మాట్లాడారు.
వారు మాట్లాడుతూ.. ఓ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరిస్తున్న శ్రీధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను కాంగ్రెస్ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారని తెలిపారు. తన సతీమణి సర్పంచ్‌గా ఉన్నప్పుడు శ్రీధర్‌రెడ్డి తొగర్‌పల్లిని నాశనం చేశారని, గ్రామ అభివృద్ధిని అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వెంచర్ల వారి వద్ద విపరీతంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తి శ్రీధర్‌రెడ్డి అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలు పోయే శ్రీధర్‌రెడ్డిని కాపాడింది మస్కు నరసింహారెడ్డి, వై.ప్రభులని గుర్తు చేశారు. ఇంగితజ్ఞనం మర్చి ఆరోపణలు చేస్తున్నశ్రీధర్‌రెడ్డికి పిచ్చి పట్టిందని, అతనిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని పేర్కొన్నారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే కర్రుకాల్చి వాత పెడతామని వారు హెచ్చరించారు.
