NTR Trivikram | ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్!

NTR Trivikram | ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్!

NTR Trivikram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఒక భారీ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ రూపుదిద్దుకోనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటనను నేడు విడుదల చేశారు. అలాగే సినిమాకు “God of War” అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

“The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander.” అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్‌ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. దేవుళ్ల సేనాధిపతి, పరమశివుని కుమారుడైన ‘కుమారస్వామి’ తత్వాన్ని ప్రతిబింబించే ఒక పవర్‌ఫుల్ డివైన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. పురాణాల్లోని యుద్ధనైపుణ్యాన్ని, ఆధునిక కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ముడిపెడుతూ త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ తన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగెన్‌ లైనప్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ఈ మైథలాజికల్ వండర్ సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలోనే అఫీషియల్ గ్లింప్స్ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.