NTR | పేదల పెన్నిధి ఎన్టీఆర్

NTR | పేదల పెన్నిధి ఎన్టీఆర్
- బెల్లంపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
- రోగులకు పండ్ల పంపిణీ
NTR | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రదాత, స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లిలో టీడీపీ శ్రేణులు ఇవాళ ఘన నివాళులర్పించాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ బెల్లంపల్లి మండల, పట్టణ అధ్యక్షులు రామటెంకి హరిబాబు, టి.మణిరామ్ సింగ్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని కొనియాడారు.

పేదవాడి ఆకలి తీర్చిన రూ.2లకు కిలో బియ్యం పథకం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి పథకాలు ఆయన సేవా నిరతికి నిదర్శనమన్నారు. సామాన్యులకు రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత అన్నగారిదేనని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జీవరత్నం, బొల్లు మల్లయ్య, సిహెచ్ రమేష్, దుర్గయ్య, గోమాస వెంకటేష్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
