Arutla | ఘనంగా ముగ్గుల పోటీలు

Arutla | ఘనంగా ముగ్గుల పోటీలు
- గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానం
Arutla | మంచాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుట్ల గ్రామంలో లెనిన్ నగర్ కాలనీలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల యాదిలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి అతిధిగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామంలో మత రాజకీయాలు, కుల రాజకీయాలు విచ్చిన్నకర శక్తులకు స్వస్తీ చెప్పాలని, గ్రామంలో యువకులను విచ్చలవిడిగా మద్యానికి బానిసలను చేశారన్నారు.

అమరవీరులు ఎన్నో త్యాగాలు చేశారని, రైతులకు సాగునీరు అందించడం కోసం ఈ ప్రాంత రైతులంతా పోరాటం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. శివన్నగూడ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని, పోరాటం చేసి సాధించుకున్న భూములకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో CPM మంచాల మండల కార్యదర్శి రావుల జంగయ్య, కార్యవర్గ సభ్యులు M.బుగ్గరాములు, మండల కమిటీ సభ్యులు పి. గోపాల్, మండల కోఅప్షన్ సభ్యులు M.D యూసఫ్ ఆలీ, ప్రజానాట్యమండలి నాయకులు బడ్డు విజయ్, అనుపటి గణేష్ KVPS నాయకులు ఏర్పుల వీరేశం, SFI నాయకులు కొండిగారి ప్రసాద్, బోయపెలి అంజయ్య, చీమర్ల గాలయ్య, తిమ్మగళ్ల శంకరయ్య, గాలయ్య, ముత్యాలు, సాతీరి నర్సింగ్, జోగు జ్యోతి, బడ్డు రజిత, కొండిగారి మంజుల, ఊదరి నర్సింహ, కొండిగారి మహిష్, బైండ్ల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
