AP | రోడ్డుప్రమాదం కాదు… హత్యే…!
భర్త హత్య కేసులో విస్తుపోయే షాకింగ్ నిజాలు..!
వివాహేతర సంబంధమే కారణం..
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీలేరులో వెలుగుచూసిన సుబ్రహ్మణ్యం (47) హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే భార్య ఉమాదేవి తన భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
డిష్ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యంను ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని ప్రియుడి సహాయంతో బైక్‌పై తరలించి, తిరుపతి హైవేపై పడేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఉమాదేవితో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
