మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంతాజిని పరామర్శించిన నాగుర్ల వెంకటేశ్వర్లు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుకినే సంతాజి ప్రమాదవశాత్తు కాలికి గాయం కావడంతో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌ మాజీ చైర్మన్‌, ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా సంతాజి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాగుర్ల వెంకటేశ్వర్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆరె కుల విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మోటె చిరంజీవి, ప్రముఖ వ్యాపారవేత్త కౌడగాని రాంబాబు, నాయకులు హింగె భాస్కర్‌, జూపాక భాస్కర్‌, శంకర్‌, రాములు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.