Nomination | నామినేషన్స్ దాఖలు..

Nomination | నామినేషన్స్ దాఖలు..

Nomination | కోటగిరి, ఆంధ్రప్రభ : పోతాంగల్ మండల పరిధిలోని హంగార్గా పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Nomination Process) రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ రోజు హంగార్గ ఫారం గ్రామానికి చెందిన రిహన బేగం(Rihana Begum) సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను గ్రామస్థులతో పాటు అధికారుల సమక్షంలో హంగార్గా ఫారం  పంచాయతీ కార్యాలయంలో దాఖలు అందజేశారు.

నామినేషన్ సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మరింత అభివృద్ధి(development) చేసే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.

Leave a Reply