ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ షురూ…

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ షురూ…
అధ్యక్షుపదవికి వంగేటి అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు …
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ మొదలు అయ్యిందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరు గౌరీశంకర్ తొర్రూరులో తెలిపారు. బుధవారం కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తూ వివరాలు వెల్లడించారు. అడ్వకేట్ కమిషనర్ టి బాలగోపేంద్రనాథ్ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని 11 బుధవారం రోజున ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ, తదుపరి స్కూటీని, జాబితా ప్రకటన, 17న పోటీలో ఉన్న అభ్యర్థులకు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.
తదుపరి గెలుపొందిన వారిని ప్రకటిస్తారని చెప్పారున్నారు. కాగా వరంగల్ జిల్లాకు చెందిన వంగేటి అశోక్ కుమార్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరి గౌరీశంకర్, చారు గుంట్ల వెంకట నరసింహారావు, వనమా వేణుగోపాలరావు (సూరి), తాటికొండ పవన్ కుమార్ పాల్గొన్నారు.
