బ్రెయిన్ స్ట్రోక్ తో కానిస్టేబుల్ మృతి…
సత్తుపల్లి, ఆంధ్రప్రభ ; బ్రెయిన్ స్ట్రోక్ తో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. సత్తుపల్లి మండలం, గంగారం 15వ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తాటి నాగార్జున (39) ఈనెల 2న తీవ్ర అస్వస్థకు గురయ్యారు.. బెటాలియన్ అధికారులు హుటాహుటిన అతన్ని ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.. దీంతో బెటాలియన్ సిబ్బందితో పాటు అతని స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, భీమునిగూడెంలో విశాదం నిండుకున్నది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..
