ఏటూరు నాగారంలో కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ బాధ్యతల స్వీకరణ

ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : ఏటూరు నాగారంలో నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా లెనిన్ వాత్సల్ టోప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయాన్ని తనిఖీ చేసి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఐటీడీఏ యూనిట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె. నాగరావు, స్టాటిస్టికల్/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. రాజ్‌కుమార్, ఆఫీస్ మేనేజర్ వి. శ్రీనివాస్, అకౌంట్స్ మేనేజర్ కె. నర్సింగ్, పిసా కోఆర్డినేటర్ కె. ప్రభాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply