మునుగోడులో న్యూ ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం

మునుగోడులో న్యూ ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం

నాణ్యమైన సేవలతో వినియోగదారుల ఆదరణ పొందాలి: తహసీల్దార్ నేలపట్ల నరేష్

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ ఒరిస్సా ఫ్యామిలీ దాబాను తహసీల్దార్ నేలపట్ల నరేష్ బుధవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన దాబా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలని సూచించారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ వ్యాపార రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.

దాబా నిర్వాహకులు మాట్లాడుతూ, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, యూఆర్డీఎస్ చైర్మన్ బొడ్డు నాగరాజు గౌడ్, గోలి లింగస్వామి, మాదనబోయిన పరమేష్ యాదవ్, నల్గొండ అంజి, యడవెల్లి సురేష్, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.