మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యులు వీరే..!

మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యులు వీరే..!

  • ప్రజాప్రతినిధుల కోటా పై ఉత్కంఠ

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో మైనారిటీ కోటాలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎం డి మహమ్మద్ అలీ, మార్కెట్ డైరెక్టర్ ఎం డి సమీర్ భార్య పర్వీన్ సుల్తానా లను ఎంపిక చేయగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కో ఆప్షన్ స్థానాలకు తమ దరఖాస్తులను కౌన్సిలర్ల సమక్షంలో దాఖలు చేశారు. ప్రజా ప్రతినిధుల కోటాలో మాజీ వార్డ్ మెంబర్,మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్,ధర్మాపురం కి చెందిన మాజీ వార్డ్ మెంబర్ అంబటి కవిత పేర్లను కో ఆప్షన్ సభ్యులుగా దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.వీరితో పాటు ఎం డి ఖాజా,బుంగపట్ల యాకయ్య,కారుపోతుల శిరీష లు సైతం తమ దరఖాస్తులు దాఖలు చేశారు.