ఉత్తమ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ మల్లం నవీన్..

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మల్లం నవీన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు ను అందజేశారు. ప్రశంస పత్రం, నగదు లక్ష రూపాయలు, జ్ఞాపికను ప్రిన్సిపాల్ నవీన్ అందుకున్నారు. ప్రిన్సిపల్ నవీన్ విద్యార్థుల అడ్మిషన్, విద్యార్థుల ఉత్తీర్ణత 100 శాతం, కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పనలో వరంగల్ జిల్లాలో విద్యార్థుల ఉత్తమ ఫలితాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందు వరుసలో ఉన్న ప్రిన్సిపాల్ నవీన్ కు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు.

రాష్ట్రస్థాయిలో ఒక్క నర్సంపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంపిక చేసి అవార్డు అందజేయడం పట్ల తోటి అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా అవార్డు పొందిన నవీన్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అనుగుణంగా భవిష్యత్తులో మరింత మెరుగ్గా విద్యార్థులకు సేవలందిస్తానని తెలిపారు. ఈ అవార్డు రావడంలో నాతోపాటు కళాశాల అభివృద్ధికి పాటుపడిన బోధన, బోధ నేతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాల అభివృద్ధి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో జిల్లా లో మొదటి స్థానంలో నిలపడం జరిగిందని మల్లన్న నవీన్ ఆంధ్రప్రభ కు తెలిపారు.

Leave a Reply