Narsampet | ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులు
Narsampet | ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులు
అభినందించిన డీఎం ప్రసూన లక్ష్మీ
Narsampet | నర్సంపేట, ఆంధ్రప్రభ : ఆర్టీసీ(RTC) కి అత్యధిక లాభాలు సమకూర్చడంలో ముందు వరుసలో నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులను నర్సంపేట ఆర్టీసీ డీఎం ప్రసూన లక్ష్మీ (Prasuna Lakshmi) అభినందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబర్చి డిపో ఆధాయానికి కృషి చేస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా ఉద్యోగులు (Employees) అందరూ కష్టపడి పనిచేసి సంస్థకు, డిపోకు మంచిపేరు తీసుకురాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
