SAIBABA | కురవి సత్యసాయిబాబాకు ఎమ్మెల్సీ పూజలు

SAIBABA | కురవి, ఆంధ్రప్రభ : మండలకేంద్రంలోని ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు హాజరై సత్య సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్సీకి ఆలయ సమితి సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సీహెచ్ శ్రీనివాస్, బాధ్యులు గండేపల్లి తిరుమలరావు, బత్తిని నర్సయ్య, వేమిశెట్టి సంతోష్, గండేపల్లి యశ్వంత్, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, గౌడసంఘం జిల్లాఅద్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్, కురవి ఆలయ మాజీచైర్మన్ బాదావత్ రాజునాయక్, మాజీయంపిపి గుగులోత్ రవినాయక్, మాజీ ఆలయధర్మకర్త కొణతం విజయ్, మాజీ వార్డ్ సభ్యుడు ఇరుగు వెంకన్న తదితరులు ఉన్నారు.
