Narendra Modi Completes 12 Years as PM | Record-Break – మోదీ పుష్కర ప్రస్థానం.. అత్యధిక కాలం ప్రధానిగా చారిత్రక రికార్డు
Narendra Modi Completes 12 Years as PM | Record-Break – మోదీ పుష్కర ప్రస్థానం.. అత్యధిక కాలం ప్రధానిగా చారిత్రక రికార్డు
ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేసిన మోదీ..
రికార్డులు, సంస్కరణలు, విజయాలు
మోదీ నాయకత్వానికి 12 ఏళ్లు..
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత ముద్ర
ఆపరేషన్ సిందూర్‌తో సత్తా చాటిన మోదీ
ప్రపంచ ఆయిల్ సంక్షోభ వేళ భారత ప్రయోజనాల పరిరక్షణలో కీలక పాత్ర

Narendra Modi Completes 12 Years as PM | Record-Break – ఆంధ్రప్రభ వెబ్, జాతీయం : భారత దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ మోదీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయనవసరం లేదు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునే అతి తక్కువ మంది రాజకీయ నేతలలో మోదీ ఒకరు. మూడు సార్లు గుజరాత్ ను పాలించిన ఆయన 2014 జూన్ 26న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసుకున్నారు. నరేంద్ర మోదీ – రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రతిష్టను పెంచిన నాయకుడు కూడా. 2026లో 4,399 రోజులు అధికారంలో కొనసాగుతూ ఎన్నికల ద్వారా వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చారిత్రక రికార్డు సృష్టించారు.
ఈ రోజు, మోదీ ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేశారు. ఈ పుష్కర కాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు, ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. 2047 లక్ష్యంగా ‘వికసిత్ భారత్’ రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు.

Narendra Modi Completes 12 Years as PM | Record-Break – మోదీ ప్రస్థానం
పూర్తి పేరు: నరేంద్ర దామోదర్ మోడీ
జననం: 17 సెప్టెంబరు 1950
స్థానం: వడ్నగర్, గుజరాత్, భారత్
కుటుంబ నేపథ్యం: మధ్యతరగతి కుటుంబం, తండ్రి టీఫ్‌షాప్ లో పనిచేశారు.
చిన్నప్పటి నుండి సామాన్య ప్రజలతో సంప్రదింపులు, కష్టపడి పనిచేయడం, సామాజిక సేవలో ఆసక్తి. వడ్నగర్ లోని స్కూల్ లో ప్రారంభ విద్య, గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా రాజకీయ శాస్త్రంలో బి.ఎ., తర్వాత మాస్టర్స్ ఇన్ పాలిటికల్ సైన్స్.

Narendra Modi Completes 12 Years as PM | Record-Break – రాజకీయ ప్రస్థానం
RSS లో యువత సభ్యుడిగా చురుకుగా పనిచేశాడు
1987లో BJP లో చేరి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు
2014, 2019, 2024లో భారత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు
నెహ్రూను అధిగమిస్తూ – చారిత్రక మైలురాయి
మోదీ 26 మే 2014 నుంచి 2026 జూన్ వరకు నిరంతరాయంగా అధికారంలో ఉన్న ఎన్నికల ద్వారా వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.
పదవీకాలం: 4,399 రోజులు
Narendra Modi Completes 12 Years as PM | Record-Break – జాతీయ ప్రణాళికలు & సంక్షేమం
మేక్ ఇన్ ఇండియా: దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం
డిజిటల్ ఇండియా: ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు, UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు
స్వచ్ఛ భారత్ మిషన్: పరిశుభ్రత, ఆరోగ్యవంతమైన జీవనం
ఉజ్వలా యోజన, ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్: సామాజిక సంక్షేమం
GST: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం

Narendra Modi Completes 12 Years as PM | Record-Break – అంతర్జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వం
BRICS: ఐదు దేశాలు – బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా – అభివృద్ధి, వాణిజ్యం, శక్తిని పంచుకుంటాయి. భారత్ వ్యూహాలు, గ్రీన్ ఎనర్జీ, వాణిజ్య ప్రాజెక్టులలో చురుకుగా ఉంది.
G20: 20 దేశాల వేదిక, ఆర్థిక సమస్యలు, పెట్టుబడులు, వృద్ధి ప్రోత్సాహం. భారత్ స్థిరమైన వృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంది.
SCO: చైనా, రష్యా, కజాఖ్‌స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, భారత్, పాకిస్తాన్. భద్రతా, వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సహకారం.
UN: అంతర్జాతీయ శాంతి, మానవ హక్కులు, పేదరిక నిర్మూలనం, SDGs, యోగా, పునరుత్పాదక ఇంధనం. భారత్ నేతృత్వంలో మోడీ ప్రధాన పాత్ర.
Narendra Modi Completes 12 Years as PM | Record-Break – విదేశాంగ దౌత్యం
అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, UAE వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం
వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకార ఒప్పందాలు
మోడీ నాయకత్వంలోని ప్రధాన రంగాలు
ఆర్థికాభివృద్ధి: మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం
డిజిటల్ విప్లవం: డిజిటల్ ఇండియా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఆన్‌లైన్ సేవలు
సంక్షేమ పథకాలు: ఉజ్వలా, PM ఆవాస్, జల్ జీవన్, ఆయుష్మాన్ భారత్
జాతీయ భద్రత: సరిహద్దు భద్రత, స్వదేశీ రక్షణ ఉత్పత్తులు, ఉగ్రవాద నిరోధక చర్యలు
ప్రపంచ వేదికలపై భారత స్వరం: BRICS, G20, UN, SCO ద్వారా భారత్ ప్రయోజనాల సమర్థ ప్రతినిధ్యం
పర్యావరణ, హరిత ఉత్సాహం: యోగా, పునరుత్పాదక ఇంధనం, సౌర శక్తి అభివృద్ధి
Narendra Modi Completes 12 Years as PM | Record-Break – సిందూర్ తో సత్తా చాటిన మోదీ
భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు దశాబ్దాలుగా సున్నితంగానే ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కనిపించే ఉద్రిక్తతలు, ఉగ్రవాద ఆరోపణలు మరియు భద్రతా సమస్యలు ప్రాంతీయ స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సిందూర్ ఆపరేషన్‌తో పాకిస్తాన్‌కు మట్టి కరిపించిన వ్యక్తి ప్రధాని మోదీ
Narendra Modi Completes 12 Years as PM | Record-Break – ఆయిల్ సంక్షోభం నివారణకు సంస్కరణ
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, సరఫరా అంతరాయం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కలిసి ఒక పెద్ద ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఉత్పత్తి పరిమితులు, రవాణా ఖర్చుల పెరుగుదలతో ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణ, ఆయిల్ సంక్షోభాన్ని నివారంచడంలో ప్రధాని కీలకపాత్ర పోషించారు.
Also Read ..బంగారం ధరలు మరింత తగ్గుతాయా?

Also Read రసాయన, అణు యుద్ధాల భయాలు
Also Read పసిడి ప్రియులు…ఇదే సరైన సమయం!

