అవనిగడ్డలో భువనేశ్వరి జన్మదిన వేడుకలు..
అవనిగడ్డలో భువనేశ్వరి జన్మదిన వేడుకలు..
సేవా కార్యక్రమాలను కొనియాడిన టీడీపీ నేతలు
సమాజ సేవలో ఆమె పాత్ర ఆదర్శనీయం.. మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్ష
అవనిగడ్డ ఆంధ్రప్రభ: అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ నారా భువనేశ్వరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలు అమోఘమని ప్రశంసించారు. ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, రక్తదాన శిబిరాలు వంటి అనేక కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు.
హెరిటేజ్ సంస్థ అధినేత్రిగా మహిళా సాధికారతకు, గ్రామీణ పాడి రైతుల అభివృద్ధికి ఆమె విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీకి కష్టకాలం వచ్చిన సమయంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తిత్వం నారా భువనేశ్వరిదని అన్నారు.
ఆమె ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజానికి మరింత సేవ చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు, అవనిగడ్డ క్లస్టర్ ఇన్‌చార్జ్ బండే రాఘవ, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, చెన్ను బాబూరావు, ఉప్పల ప్రసాద్, దాసినేని శ్రీనివాసరావు, బండే కనకదుర్గ, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, ఆకుల సీతామహాలక్ష్మి, ముళ్లపూడి శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు, మట్టా బాబ్జీ, కొల్లూరి వాసు, కొక్కిలిగడ్డ నాగరాజు, ఒడుగు వెంకటేశ్వరరావు, విశ్వనాథపల్లి దావీదు, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, కొల్లాటి ధనుంజయరావు, కమ్మిలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
