సూపర్ సిక్స్‌తో ప్రతి ఇంటికి న్యాయం
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
- కోడూరులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం
- కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరణ
- ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
- గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం
- పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం
ఏ. కొండూరు, ఆంధ్రప్రభ: ప్రజా తీర్పే మా బలం.. సూపర్ సిక్స్‌తో ప్రతి ఇంటికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాంఅని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.
ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తిరువూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
