స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ, ప్రదర్శన

పరకాల (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాలయ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పరకాల పట్టణంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సెంటర్ ప్రధాన రహదారి మీదుగా అమరధామం వరకు కొనసాగింది. అక్కడ స్వాతంత్ర్య అమరవీరులకు విద్యార్థులు నివాళులర్పించారు.

అనంతరం ర్యాలీగా బస్టాండ్ కూడలికి చేరుకున్న విద్యార్థులు జాతీయ గీతాలాపనతో పాటు నృత్య ప్రదర్శనలు నిర్వహించి జాతీయ జెండాకు వందనం చేశారు. విద్యార్థుల దేశభక్తి ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్‌వీఎన్ రావు (గోపి), ఉపాధ్యాయులు ఆయేషా ఫాతిమా, పాఠశాల పీఈటీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.