మహిళ దారుణహత్య…

ఆకివీడు, ఆగస్టు15 (ఆంధ్రప్రభ ) : ఆకివీడు మండలం ఉప్పుటేరు నుండి మందపాడు వెళ్లే రహదారిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గాయాలతో ఉప్పుటేరు నుండి మందపాడు వెళ్లే రహదారి ఉదయం ఒక మహిళ మృతదేహం కనబడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

గాయాలు ఉండడంతో హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన స్థలానికి క్లూస్ టీమ్స్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళకు సుమారు 38 సంవత్సరాలు ఉండొచ్చని, ఆ మహిళ ఎవరనే విషయం తదుపరి దర్యాప్తులో తేలనున్నట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ రఘువరన్ విష్ణు నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని సిఐ కాళీచరణ్ పేర్కొన్నారు.