మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిట్యాల (ఆంధ్రప్రభ): నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యు. గురులింగం, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, సైదులు యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.