అంతంపల్లిలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
బిక్కనూర్ (ఆంధ్రప్రభ): మండలంలోని అంతంపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సహకార సంఘం వద్ద సొసైటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ వలకొండ రాణి మంజుల జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కనుల పండువగా కొనసాగాయి.
