ఉద్యమకారుల సంక్షేమ కమిటీకి వినతి పత్రం సమర్పణ
ఆలేరు,ఆంధ్రప్రభ: ఆలేరు కు చెందిన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర జాన్సన్ హైదరాబాదులో శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ సమావేశానికి హాజరై తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రొఫెసర్ కోదండరామ్ కు ఈ వినతి పత్రాన్ని జాన్సన్ అందజేశారు. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు పెన్షన్, ఉద్యోగాలు, ఇంటి స్థలం నిర్మాణం, హెల్త్ కార్డులతో పాటు ఇతర అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు రచ్చ రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
