స్వయం ఉపాధి మార్గాలతో ఆర్థిక అభివృద్ధి పొందాలి

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ప్రారంభించారు. స్వయం ఉపాధి మార్గాలలో యువత ఆర్థిక అభివృద్ధి సాధించి పురోగమించాలని సూచించారు. స్థానిక కౌన్సిలర్లు, పార్టీ బాధ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.