మరోసారి అదే నాయకత్వంపై సభ్యుల విశ్వాసం..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా జినుకల ప్రభాకర్ 5 వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి కోపరేటివ్ ఇన్స్పెక్టర్ తరుణ్ ప్రకటించారు.ఉపాధ్యక్షులుగా సాధుల అంజయ్య,కార్యదర్శిగా జినుకల కిష్టయ్య, డైరెక్టర్లుగా సాదుల రాములు, జినుకల భిక్షం, జినుకల సత్తయ్య, ఇట్టబోయిన రామ్మూర్తి, గన్నెబోయిన రాజశేఖర్, మాటూరి నర్సయ్యలను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికైన జినుకల ప్రభాకర్ గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర డైరెక్టర్ గా పనిచేస్తూ సంఘ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారన్నారు.

ఆయన సేవలను గుర్తించి 5వ సారి తిరిగి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఆయనకే పట్టం కట్టామన్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన అధ్యక్షులు జిను కల ప్రభాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఐదు సార్లు ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు సంఘము బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని, ఎల్లవేళలా సంఘం అభివృద్ధి దిశాగా కృషి చేస్తు అందరికీ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు జినుకల ప్రభాకర్ ను సభ్యులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

Leave a Reply