చౌటుప్పల్లో ఘనంగా ఇందిరమ్మ శక్తి చీరల పంపిణీ
- వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్
- ఎస్ఐఆర్ ఫామ్లపై మహిళలకు అవగాహన సదస్సు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 14వ వార్డు గౌడ సంఘం ఆవరణలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కాలనీకి చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఎస్ఐఆర్ ఫామ్లపై అవగాహన
చీరల పంపిణీ అనంతరం మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్ల సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ‘ఎస్ఐఆర్ ఫామ్’ల ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జ్యోతి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సర్వేలకు సంబంధించిన వివరాల నమోదులో ఎస్ఐఆర్ ఫామ్లు ఎంతో కీలకమైనవని, మహిళలందరూ వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, వర్కాల రవి గౌడ్, కామిశెట్టి శేఖర్ గుప్తా, దొడ్డి గణేష్, ఉష్కాగుల నాగరాజు గౌడ్, వరగంటి భాను గౌడ్, చెరుకు రాజు గౌడ్, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

