సబ్జెక్టులపై పట్టు సాధించాలి…
సబ్జెక్టులపై పట్టు సాధించాలి…
ములుగు, ఆంధ్రప్రభ : విద్యార్థులు సమయం వృధా చేయకుండా ఉపాధ్యాయులు బోధించే పాటల పై దృష్టి పెట్టి పట్టు సాధించాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి విద్యార్థులకు సూచించారు. ఈ రోజు మండల పరిధిలోని క్షీరసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Ksheera Sagar Zilla Parishad High School)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని వంటగది, మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు.
ప్రతిరోజు ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. పరిసరాలతో పాటు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు చదువు, భోజనం(education, meals) విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలి అని పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయున్ని, ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో పాఠ్యాంశాలపై చర్చించారు, ఉపాధ్యాయుడు బోధించే ప్రతి అంశాన్ని దృష్టి పెట్టి చదవాలని, సమయం వృధా కాకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఏ సబ్జెక్ట్(Subject) అయితే కఠినంగా అనిపిస్తుందో ఆ సబ్జెక్టు పై ఉపాధ్యాయుల నుండి సమాధానాలు రాబట్టుకొని ముందుకెళ్లాలని ఆమె తెలిపారు.
అనంతరం వంటిమామిడి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో సందర్శించి ప్రభుత్వం సూచించిన ప్రకారం విద్యార్థులకు సరైన భోజన వసతులు కల్పించడం లేదని చెప్పిన మెనూ ప్రకారం(menu) చేయకుండా ఇష్టం వచ్చింది వండి విద్యార్థులకు పెట్టడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కూరతో సరిపెట్టుకుంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తప్పనిసరిగా మెనూ పాటించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అలా చేయనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


