రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ కు శంకుస్థాపన
రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ కు శంకుస్థాపన
బ్రాహ్మణపల్లిలో ఘనంగా కార్యక్రమం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వర్చువల్ విధానంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన ఘన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ (Minister TG Bharat) మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల విస్తరణకు అనుకూల వాతావరణం కల్పిస్తోందని తెలిపారు. కర్నూలు జిల్లా పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని చెప్పారు.
కలెక్టర్ డా.ఏ.సిరి (Collector Dr. A. Siri) మాట్లాడుతూ… పరిశ్రమల స్థాపనతో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, పరిశ్రమల ఆరంభం తమ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

