murder | పెద్దేముల్ మండలంలో దారుణం

murder | పెద్దేముల్ మండలంలో దారుణం

  • భార్యను హత్య చేసిన భర్త

murder | పెద్దేముల్, ఆంధ్రప్రభ : పెద్దేముల్ మండ‌లంలోని దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ర‌వి అనే వ్య‌క్తి భార్య అనిత‌తో గొడ‌వ ప‌డుతూ హ‌త్య చేశాడు. పెద్దేముల్ మండల కేంద్ర పరిధిలోని తాండకు చెందిన చౌహాన్ రవి, అనిత (35) భార్య భర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. రవికి కొంత ఆరోగ్యం భాగాలేదు. ఇదే విషయంలో ఈ రోజు మధ్యాహ్నం భార్య, భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో కోపంతో రవి, ఆయ‌న‌ భార్యపై ఇంట్లో ఉన్న సాలికే పారతో కొట్టాడు. దీంతో అనితకు తీవ్రరక్తస్రావం అయ్యింది. రక్తపు మడుగులోనే అనిత అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు నిందితుడి రవిని స్థానిక పోలీసులకు అప్ప‌గించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.