హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ లోని ఓ హోటల్ గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందగా, మరి కొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలాయి. మృతులు బిహార్ కు చెందిన కార్మికులుగా సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…