గడ్డి మందు ఎందుకు తాగాడు…?
గన్నేరువరం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థి బోయిని సాయికుమార్ ఈ రోజు పాఠశాలలోనే గడ్డిమందు తాగి(Drink grass) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఉపాధ్యాయుల వివరాల ప్రకారం.. గత శుక్రవారం సాయికుమార్ మృతి చెందిన పామును తరగతి గదికి తీసుకువచ్చి ఓ విద్యార్థిని లంచ్ బాక్స్(lunch box) లో పెట్టాడు. దీనిపై ఉపాధ్యాయులు కఠినంగా మందలించి, అతడి తల్లిదండ్రులను(parents) పాఠశాలకి తీసుకురావాలన్నారు. ఇంట్లో ఈ విషయం చెప్పకుండా మూడు రోజులవరకు పాఠశాలకు హాజరుకాలేదు. ఈ రోజు పాఠశాలకు వచ్చి గడ్డిమందు తాగాడు.
ఈ విషయాన్ని గమనించి వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థి తండ్రి చంద్రయ్యకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్(ambulance) లో తీసుకెళ్లి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నా 24 గంటలు గడిస్తేనే(24 hours later) ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.

