కాలువ పనులకు శ్రీకారం

కాలువ పనులకు శ్రీకారం

మునుగోడు , ఆంధ్రప్రభ:
నియోజకవర్గ రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపర్చే దిశగా మరో కీలక అడుగు పడింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం నుంచి 1ఆర్ కాలువ నేరడ ద్వారా బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, పులిపలుపుల, కలవలపల్లి గ్రామాల వరకు చేపట్టనున్న కాలువ పనులను బుధవారం ప్రారంభించారు.

ఈ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాలువ పునరుద్ధరణతో ఆయా గ్రామాల రైతులకు సాగునీటి సమస్యలు తగ్గి వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, పులిపలుపుల గ్రామాల సర్పంచులు దాసరి గోవర్ధన్, గొపగోని పాపయ్య, కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.