వరి ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలి…

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం బాచన్ పల్లి, పిప్రి (జె)గ్రామాలలో ఐకేపీ, పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం తహసీల్దార్ ఎం.కిరణ్ కుమార్, ఎంపీడీవో సంతోష్ కుమార్ సందర్శించి పలు సూచనలు అందించారు.ఈ సందర్భంగా సెంట్రల్ ఇన్చార్జిలతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు వివరాలను తీసుకున్నారు.
సెంటర్ లో ఉన్న బ్యాగులకు అవసరమైన లారీలను అందించుటకు డిఎం.సివిల్ సప్లై మరియు వాహన ఇంచార్జ్ అధికారులతో మాట్లాడి త్వరి తగతిన రైస్ మిల్లులకు పంపిచ్చుటకు కోరడం జరిగింది. అదేవిధంగా సెంటర్లో కొనుగోలు కు సిద్ధంగా ఉన్న వరి ధాన్యాన్ని కాంటాతో వెంటనే కొనుగోలు చేయాలని సెంటర్ ఇంచార్జి లకు ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అరిగేల జనార్ధన్, వెన్నెల బాలమణి జనార్ధన్, పంచాయతీ సెక్రటరీలు శేఖర్, సంజయ్, ఐకేపీ సిబ్బంది సింగిల్ విండో సిబ్బంది పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
