సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు …
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు …
పలు విభాగాలు ,ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించిన
పశ్చిమ ఎమ్మార్వో డి.రిభ్కా రాణి
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో పలు సినిమా థియేటర్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పశ్చిమ ఎమ్మార్వో డి.రిభ్కా రాణి.ఈ సందర్భంగా మంగళవారం పశ్చిమ పరిధిలో ఉన్న సాయిరాం థియేటర్లో పలు విభాగాలను (ఆహార భద్రత విషయంలో క్యాంటీన్లో ఆహార పదార్థాలు, మంచినీటి బాటిల్స్ నిలువలను వాటి తయారు తేదీ ధరలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీట్లు యొక్క పరిమితి,అగ్నిమాపక భద్రత, పార్యశుద్ధ్య చర్యలు వివిధ అంశాలను ) పరిశీలించి వివరాలను విచారించి ,తగు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
