ఘనంగా గ్రామదేవతల పున ప్రతిష్ట మహోత్సవం

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలోని ముత్యాలమ్మ, గంటలమ్మ, ఎల్లమ్మ, పోతురాజు, పోలేరమ్మ విగ్రహాల పునః ప్రతిష్ఠ మహోత్సవంలో శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.