Monitoring | మెనూ అమలు బాధ్యత హెచ్ఎంలదే…

Monitoring | మెనూ అమలు బాధ్యత హెచ్ఎంలదే…
Monitoring | ఉట్నూర్, ఆంధ్రప్రభ : మెనూ అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ప్రాజెక్ట్ అధికారి(Project Officer) యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఆశ్రమ పాఠశాలలు వసతిగృహాల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్ల సమావేశంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్(KB Complex) లోని పి.ఎం.ఆర్.సి యందు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మార్మాట్ మాట్లాడుతూ… విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, దానిని డీడీల ఆధ్వర్యంలోని హామీల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన మార్పులు చేపడతామని తెలిపారు.
మెనూ అమలు మానిటరింగ్(Monitoring) కోసం నూతన యాప్ ను రూపొందించామని, దీని ద్వారా సులువుగా మెనూ అమలుతీరు పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్లపై తగిన తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థులు భోజనం చేసే ముందు తప్పనిసరిగా సబ్బుతో శుభ్రంగా(Cleaning) కడుక్కోవడం, ఒక క్రమ పద్ధతిలో మంచి అలవాట్లు చేసుకోవాలని, ప్రతి విద్యార్థి మంచి అలవాట్లు, పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి సంస్థ ఉపసంచాలకులు జాదవ్ అంబాజీ, రీజనల్ కోఆర్డినేటర్ అగస్టీన్, ఏసీఎంఓలు, బాలికల అభివృద్ధి అధికారి నిలుమేశ్రం ఛాయా కోట్నాక్ శకుంతల ఏటీడబ్ల్యూఓలు, తదితరులు పాల్గొన్నారు.
