Lessons | లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి..

Lessons | లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి..

  • ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

Lessons | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : విద్యార్థులు తమ లక్ష్యాలను, ఉన్నతమైనదిగా ఎంచుకుని అందరికీ ఆదర్శంగా నిలువాలని, అందుకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు వారిలోని ప్రతిభను వెలికితీసి ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించే విధంగా పాఠాలు బోధించాలని పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. మండల పరిధిలోని సంఘమూడి ఉన్నత పాఠశాల నందు శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్నిఅత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే (MLA) ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

కార్యక్రమంలో మార్కెట్ (MARKET) యార్డ్ చైర్మన్ తులసీరావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేష సాయి, డీసీ చైర్మన్ భాస్కరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నకేశవరావు, ప్రధాన కార్యదర్శి యాదమరెడ్డి కొండ, మాజీ ఎంపీపీ సత్యనారాయణ, జనసేన నాయకులు పంచకర్ల సురేష్, స్థానిక నీటి సంఘం అధ్యక్షులు కూనసాని శ్రీనివాసరావు, అశోక చక్రవర్తి, ట్రస్ట్ చైర్మన్ చేకూరి వెంకట్రావు, స్థానిక సర్పంచి సునీత శ్రీనివాసరావు, కూనసాని చిన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌ల‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Leave a Reply