- ఇందిరాగాంధీ స్టేడియం నుండి ప్రారంభం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు విజయవాడలో తిరంగా ర్యాలీని నిర్వహించింది.
ఆపరేషన్ సింధూర విజయోత్సవం సందర్భంగా భారత సైనికులకు సంఘీభావంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బందర్ రోడ్డులోని బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కాగా, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ ర్యాలీలో వేల సంఖ్యలో ప్రజలు హాజరవ్వడంతో బందర్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమం సందర్భంగా నగరంలో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ను మళ్ళించారు.