పొగాకుకు వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమం

పొగాకుకు వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమం
విజయవాడసెంట్రల్, ఆంధ్రప్రభ : మొగల్రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ (మెట్రో ) వద్ద నవజీవన్ బాల భవన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా పోస్ట్ కార్డ్స్ ఉద్యమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరావు పాల్గొని మాట్లాడుతూ పొగాకు ఆరోగ్యానికి అత్యంత హానికరమని, పొగాకు వినియోగం వలన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నవజీవన్ సంస్థ వినూత్నంగా నిర్వహిస్తున్న పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్ అభినందనీయమని అన్నారు.
