FUND | చేనేత కార్మికుల రుణమాఫీ
FUND | చేనేత కార్మికుల రుణమాఫీ
FUND | మోత్కూర్, ఆంధ్రప్రభ : చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులకు రుణమాఫీ కోసం రూ.33 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్థపు మురళి లకు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోచం కన్నయ్య శనివారం హర్షం వ్యక్తం చేశారు.మున్సిపల్ కేంద్రంలో ని పద్మశాలి కాలనీలో జరిగిన చేనేత కార్మికుల సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు , పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న డూప్లికేట్ ప్రింటింగ్ వస్త్రాలను అరికట్టాలని ,జియో ట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నేతన్నభరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వంగరి రాములు , నాయకులు వంగరి యాదగిరి , పోచం రాజు , దోర్నాల మత్స్యగిరి, వంగరి ధనమ్మ , పోచం లక్ష్మి, రేగోటి రమాదేవి, గుర్రం అంబ దాస్ , తాటి లక్ష్మణ్, కందుల వెంకన్న, తవిటి హరినాథ్ తదితర చేనేత కార్మికులు పాల్గొన్నారు.
