మల్లంపల్లి అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క

  • మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు..

ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లాలో నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండల అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క అని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అన్నారు. సాధన సమితి ఉద్యమానికి, మండలం ఏర్పాటు ప్రక్రియకు మంత్రి సీతక్క సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు.

బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గతంలో పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ మండలాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారన్నారు. మరోవైపుదివంగత నేత కుసుమ జగదీష్ మండల ఏర్పాటు కోసం ప్రయత్నించి మానసిక వేదనకు గురయ్యారని, ఆ సమయంలో మీ చిత్త శుద్ధి ఏమైందని ప్రశ్నించారు.

వారితో మండల అధ్యక్షుడు ల్యాద శ్యామ్ రావు ,మాజీ ఉపసర్పంచ్ చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమా వేణు, చిట్టి రెడ్డి రామ్ రెడ్డి వనమ శ్రీనివాస్ , మూల గణేష్ రెడ్డి, కాగితోజు దేవేందర్, గొర్రె కుమార్, నాగుల శ్రీకాంత్, క్లాసిక్ రవి, తాళ్ల పెళ్లి సాంబయ్య, అయితే బద్రి, అంగరి మహేష్, తదితరులు ఉన్నారు.

Leave a Reply