మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు.

మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు.

భవానిపురం, ఆంధ్రప్రభ : విద్యాధరపురం గుప్తా సెంటర్ షాదీ ఖానా సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు రెండో రోజు కూడా కొనసాగింది.ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఉచిత మొబైల్ మెడికల్ క్లినిక్ కు విశేష సంఖ్యలో స్థానికులు వచ్చారు.ఈ క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయంతో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో అమ్మ హాస్పటల్ వాస్క్యూలర్ సర్జన్ శశిధర్ ఆధ్వర్యంలో వేరికోస్ వెయిన్స్ రోగులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.

శంకర్ నేత్ర చికిత్సాలయం వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు.స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి టీమ్ మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట రమణ, కిరణ్ , హరీష్ లతో పాటు సుజనా మిత్ర కోఆర్డినేటర్లు. పాల్గొన్నారు.

Leave a Reply