Huzurnagar | రైస్ మిల్ లో ప్రమాదం…

Huzurnagar | రైస్ మిల్ లో ప్రమాదం…

నలుగురు కూలీలకు తీవ్రగాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం


Huzurnagar | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ లో ఉన్న సాయిబాలాజీ ఫారబాయిల్డ్ రైస్ మిల్ (Farboiled Rice Mill) లో కాలిన వరిపొట్టు బూడిద లారీలో లోడ్ చేస్తుండగా బూడిదగుట్ట కూలింది. దీంతో ఒక్కసారిగా కూలీలపై పడడంతో నలుగురు కార్మికుల శరీరంపై పడి వారికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడిన బాధితులను చికిత్స కోసం 108లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా కోదాడ (Kodada) లోని శ్రీ రంగాపురం వాసులు సాతినేని దుర్గ, షైక్ ఫిరోజ్ లకు తీవ్రగాయాలు కాగా.. వారిని మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. జాన్ భి, షైక్ మదార్ లు హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.