అనాధ పిల్లలకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆత్మీయ భరోసా

అనాధ పిల్లలకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆత్మీయ భరోసా
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం పంచాయతీలో గల రాంజీ గోండు నగర్ కాలనీకి చెందిన ఆత్రం గంగు బాయి… ఇటీవల రిమ్స్ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లి తల్లీ మృతి చెందగా 11 రోజుల పసిపాప తల్లి మృతి చెందడంతో అనాధగా మారింది. గంగుబాయి మృతి చెందగా భర్త గత 4 నెలల క్రితం మృతి చెందాడని బంధువులు తెలిపారు. తల్లిదండ్రి మృతి చెందడంతో 11 రోజుల పసిగుడ్డు,3 సంవత్సరాల కొడుకు అనాధలయ్యారు.
విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం రాంజీగొండ్ నగర్ కు పోయి అనాధ పిల్లలను అక్కున చేర్చుకున్నారు… ప్రభుత్వం నుండిఆర్థిక సహాయం అందించడానికి అప్పుడే అధికారులతో మాట్లాడారు.తక్షణ మే ఎమ్మెల్యే 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి.. పసిపిల్లాడికి పాలు. ఇవ్వాలని సూచించారు. పసిగుడ్డు ను ఎత్తుకొని తన ఆత్మీయతనుచాటుకున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో.. ఇంత ఆత్మీయత కనబరిచిన ఎమ్మెల్యే ని చూసి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు.
ఈ కార్యక్రమం లో లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకొల తిరుపతి.. మర్సుకొల సరస్వతి. గ్రామ పటేల్ సలాం దేవ్ రావుపటేల్, మర్సుకొల సురేందర్,కాంగ్రెస్ నాయకురాలు మడవి నీలా బాయి,గేడం మారుతీ, గేడంసుభాష్.సీతారామ్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
