కేటీఆర్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
నేరడిగొండ, ఆంధ్రప్రభ : బోథ్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద బోథ్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు స్వాగతం తెలుపగా, అక్కడి నుంచి ఆయన సిరికొండ మండలానికి బయలుదేరారు. ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరికొండ మండలానికి చెందిన రైతు పాండురంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
అనంతరం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
