జిల్లాకు మరింత గుర్తింపు తేవాలి..

జిల్లాకు మరింత గుర్తింపు తేవాలి..

  • ప్రభుత్వ విప్ విజయరమణారావు
  • జిల్లా కలెక్టర్కు ఘన సన్మానం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : విద్య ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లా అగ్రగామిగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉందని, జిల్లాకు మరింత గుర్తింపు తెచ్చేలా పని చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. జిల్లాను విద్యా ప్రమాణాల పెంపులో అగ్రగామిగా నిలిపినందుకుగానూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షని అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీహర్షను ప్రభుత్వ విప్ విజయరమణారావు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపు విషయంలో కా ఎద్దపల్లి జిల్లాకు గుర్తింపు రావడం ఎంతో గొప్ప విషయమని, రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లాకు మరెన్నో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.