మంత్రి సీతక్కను కలసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి
కుమార్తె వివాహ పత్రికను అందజేత
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావు సతీమణి తోట అర్చన బుధవారం నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి అనసూయ (సీతక్క)ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా తన జ్యేష్ట పుత్రిక జొనిట వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ వేడుకకు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా ఆహ్వానించారు.
ఈసందర్భంగా తోట అర్చన ఆహ్వానాన్ని మంత్రి సితక్క సాదరంగా స్వీకరించారు. ముందస్తుగా శుభాకాంక్షలు అందజేస్తూ, నూతన జంట దాంపత్యజీవితం ఆనందంగా, ఆయుఆరోగ్యలతో, సిరిసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఇరువురు కొద్దిసేపు ముచ్చటించారు.
