పేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండ
మైలవరం, ఆంధ్రప్రభ: పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మైలవరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం కోడి రెక్కల చంద్రశేఖర్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.05 లక్షల ఎల్ఓసీని టీడీపీ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఖరీదైన వైద్యం అవసరమైన సందర్భాల్లో ఈ నిధులు బాధిత కుటుంబాలకు ఎంతో భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చారు గుండ్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ జల్లి కృష్ణ, షేక్ బాజీ, షేక్ షహనా బేగం తదితరులు పాల్గొన్నారు
